సమ్మూ... రానా కెమిస్ట్రీ అదుర్స్...

- February 07, 2016 , by Maagulf
సమ్మూ... రానా కెమిస్ట్రీ అదుర్స్...

టాలీవుడ్ నటుడు రానా, బ్యూటీ సమంత మొట్టమొదటిసారిగా కలిసి నటించడం విశేషం. అయితే తెలుగులో కాదండోయ్.. మలయాళ సినిమా 'బెంగుళూరు డేస్' తమిళ రీమేక్ అయిన 'బెంగుళూర్ నాట్కల్' అనే మూవీలో. ఇందులో సమ్మూ... రానా మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా నటిస్తే.. రానా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌గా యాక్ట్ చేశాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో వీళ్ళ రొమాంటిక్ సాంగ్ ఆడియెన్స్‌ని కట్టి పడేసిందని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ అంటున్నారు.శ్రీ దివ్యతో మ్యారేజ్ అయ్యాక కూడా రానా తన గర్ల్ ఫ్రెండ్‌ను మరిచిపోలేకపోతాడని, కానీ ఆ తరువాత శ్రీ దివ్య, రానా మధ్య మళ్ళీ సఖ్యత కుదురుతుందని ఆయన అన్నాడు. మొత్తానికి ఈ కామెడీ మూవీ ఈ నెల 5న తమిళనాడులో రిలీజ్ అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com