తోలు బొమ్మల సిత్రాలు లోగో ఆవిష్కరణ!
- September 06, 2020
కోమారి జానకిరామ్ దర్శకత్వంలో నిర్మిస్తన్న చిత్రం యొక్క తొలుబొమ్మల సిత్రాలు బ్యానర్ వీడియో మరియు లోగోను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఎస్. బి.అంజద్ భాషా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ...
సినిమా పుట్టుకకి బీజమైన తోలుబొమ్మలాట కళని తోలుబొమ్మల సిత్రాలు అని బ్యానర్ గా నిర్మించినందుకు అభినందిస్తూ ఈ బ్యానర్ తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంస్థగా ఎదగాలని ఈ బ్యానర్ లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నానని తెలిపారు.
దర్శకులు కొమారి జానకిరామ్ మాట్లాడుతూ...
మా తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ లోగో మరియు వీడియా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్ర కథాంశంను తెలుసుకొని ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని వారు తెలుపడం సంతోషం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ ను ఇతర విషయాలను త్వరలో తెలుపుతానని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరామెన్ డి.యాదగిరి, ఎడిటింగ్ సునీల్ మహారణ, సంగీతం యు.వి.నిరంజన్, నిర్మాత కొమారి జానయ్య నాయుడు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోమారి జానకిరామ్.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







