ఒమన్‌లో భారతీయ సినిమా చిత్రీకరణ
- February 10, 2016
ఒమన్‌లో ఓ భారతీయ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. మార్చ్ నుంచి ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని మస్కట్‌కి చెందిన చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత తెలిపారు. 130 మంది సభ్యులు గల చిత్ర బృందం ముట్రాహ్, ఇబ్రి మరియు ఒమన్‌లోని కొన్ని లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతారని ఆయన అన్నారు. మానవీయ సంబంధాల నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుందని, భారతీయ తల్లికి జన్మించిన ఇరానియన్ బాలికకి సంబంధించిన కథ అనీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెన్నీ జాన్సన్ అన్నారు. ఇండియన్ స్టేజ్, టెలివిజన్ మరియు ఫిలిం యాక్టర్ అదిల్ హుస్సేన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈయన 'రిల్యుక్టెంట్ ఫండమెంటలిస్ట్' మరియు 'లైఫ్ ఆఫ్ పై' చిత్రాల్లో నటించారు. శ్వేతా మీనన్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోందని, హాలీవుడ్ నటి రీమ్ కాదెమ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తోందని మెజూన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలిపారు. 'నావల్ ఎన్నా జ్యుయెల్' అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కుతుంది. రెంజిల్ లాల్ దామోదరన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఒమన్‌లో మార్చ్ నెలాఖరు నుంచి 20 రోజులపాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి ఈ చిత్రాన్ని అనువదిస్తారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







