రేజీనా పంట పండనుందా..
- May 25, 2015
గత ఏడాది రెజీనా జోరు చూస్తే టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఎదుగుతుందేమో అనుకున్నారంతా. కానీ కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి మోడరేట్ సక్సెస్‌లు అందుకున్నా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తప్ప తెలుగులో వేరే అవకాశాల్లేవు రెజీనాకు. తమిళంలో మాత్రం రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఐతే ఇప్పుడు రెజీనాకు ఓ మంచి ఆఫర్ తగిలింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కబోతున్న కొత్త సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. హనుమాన్ ముప్పరాజు అనే కొత్త దర్శకుడితో విష్ణు ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. విష్ణు చాలా ఏళ్ల తర్వాత బయటి నిర్మాతలతో చేయబోతున్న సినిమా ఇది. ఓ విభిన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. మంచు ఫ్యామిలీ హీరోతో రెజీనా జతకడుతుండటం ఇదే తొలిసారి. మంచు హీరోలకు ఓ హీరోయిన్ నచ్చిందంటే తమ సొంత సినిమాల్లో వరుసగా అవకాశాలిస్తారు. తాప్సి, హన్సిక, ప్రణీతల అలాగే వరుసగా సినిమాలు దక్కించుకున్నారు. రెజీనా కూడా ఆ లిస్టులో చేరుతుందేమో చూడాలి. విష్ణు ప్రస్తుతం 'డైనమైట్' పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అదయ్యాక కొత్త సినిమా మొదలవుతుంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







