'నా అల్లరి' అంటున్న నరేష్..
- May 25, 2015
శ్రీ వాసవీ కన్యాకా పరమేశ్వరి నిర్మాణ సారథ్యంలో కిరణ్‌కుమార్ తులసి నిర్మాతగా విష్ణువర్థన్ దర్శకత్వంలో అల్లరి నరేష్, నిఖిత, దివ్య హీరో హీరోయిన్స్‌గా తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో 'నా అల్లరి' పేరుతో అనువదించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ మొదటి వారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కిరణ్‌కుమార్ తులసి విశేషాలను తెలియజేస్తూ... ''యువతను ఆకర్షించే 5 పాటలకి యువన్‌శంకర్‌రాజా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. దర్శకుడి టేకింగ్ స్టయిలిష్‌గా వుంటుంది. ఎక్కడా తగ్గని వినోదం అల్లరి నరేష్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించడమే కాకుండా ఆమె ఒక ప్రత్యేక పాటలో నర్తించడం మరో హైలైట్. పూర్తి వినోదభరితమైన ఈ చిత్రాన్ని జూన్ మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం'' అన్నారు. ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, కెమెరా: కృష్ణన్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, నిర్వహణ: తిప్పతి శవకుమార్, నిర్మాత: కిరణ్‌కుమార్ తులసి, స్క్రీన్ప్తే, దర్శకత్వం: విష్ణువర్థన్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







