తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల సీడీ, పుస్తకాల ఆవిష్కరణ
- October 16, 2020
హైదరాబాద్:నేడు హైదరాబాదులోని అశోక్ నగర్ లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర బాధ్యులు ఈ సంవత్సరం రికార్డు చేసిన 8 సాంప్రదాయ బతుకమ్మ చప్పట్ల పాటల సీడీని ఆవిష్కరించారు. జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సూచన మేరకు రూపకల్పన చేసిన ఈ సీడీలోని పాటలను కవి, రచయిత కోదారి శ్రీను సేకరించగా ప్రముఖ గాయనిలు తేలు విజయ, పద్మావతి, వరం తదితరులు పాడారు. అలాగే మహిళలకు పాడుకోడానికి అనుకూలంగా ఉండేలా ఇప్పటి వరకు జాగృతి తయారు చేసిన సీడీలలోని బతుకమ్మ పాటలతో ముద్రించిన బతుకమ్మ పాటల పాకెట్ సైజ్ పుస్తకాలను కూడా ఆవిష్కరించారు.
అలాగే మూడు ప్రత్యేక బతుకమ్మ గీతాలను కూడా నేడు విడుదల చేసారు. దామోదర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఈ మూడు గీతాలకు రచన, సేకరణ కోదారి శ్రీను, సంగీతం వేణు, గానం తేలు విజయ, పద్మావతి, స్ఫూర్తి, వరం. ఈ పాటల సీడీ, పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు మేడె రాజీవ్ సాగర్, వరలక్ష్మి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, కార్యదర్శి రజిత, హైదరాబాదు అధ్యక్షులు అనంతుల ప్రశాంత్, రంగారెడ్డి అధ్యక్షులు అర్చన సేనాపతి, మేడ్చల్ అధ్యక్షులు ఈగ సంతోష్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







