‘కళాపోషకులు’ చిత్రం నుండి నువ్వేలే నువ్వేలే సాంగ్ విడుదల!
- October 26, 2020
హైదరాబాద్:విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల దర్శకత్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’. నటుడు జెమిని సురేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని నువ్విలా... నువ్విలా అంటూ సాగే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ ..
కళాపోషకులు మూవీ నుండి చిత్ర, విజయ్ ప్రకాష్ గారు అద్భుతంగా పాడిన నువ్వేలే... నువ్వేలే.. పాటను సుస్వరాల కిరీటి కోటి గారు విడుదల చెయ్యడంతో ఆనందంగా ఉంది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. సుధాకర్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడం వల్లే ఔట్పుట్ ఇంతబాగా వచ్చింది. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా అయినా చాలా బాగా నటించారు. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించిందని అన్నారు.
నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ...
టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. ఈ కథకి హీరోగా విశ్వకార్తికేయ పర్ఫెక్ట్ చాయిస్. దర్శకుడు చలపతి పువ్వల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు అదనవు ఆకర్షణలు కానున్నాయి. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతోంది. మీ అందరి సపోర్ట్ కావాలి అన్నారు.
హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ - ``ఈ మూవీ ఒక టీమ్ వర్క్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సపోర్ట్‌తోనే మంచి ఔట్పుట్ సాధ్యం అయింది. నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి గారు ముందుండి మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. చలపతి గారు ఈ కథ నరేట్ చేస్తున్నప్పుడే బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. మేమందరం ఎంతో ఇష్టంగా కష్టపడి చేసిన `కళాపోషకులు` చిత్రానికి మీ అందరి ఆశిర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను
కెమెరామెన్: కళ్యాణ్ సమి
ఎడిటర్: సెల్వ కుమార్
సంగీతం: ఎలేందర్ మహావీర్
పీఆర్ఓ: సాయి సతీష్
నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వల.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







