హాట్ ఎయిర్ బెలూన్లలో సామూహిక పెళ్ళిళ్ళు ...
- February 15, 2016
వివాహ వేడుకను బంధుమిత్రుల మధ్య ఘనంగా జరుపుకోవాలనుకుంటారు మనదేశంలో. కానీ ఇతర దేశాల యువత మాత్రం ఎంత వినూత్నంగా జరుపుకోవాలా అని చూస్తోంది. లాట్వియా దేశానికి చెందిన 50 ప్రేమ జంటలు వాలెంటైన్స్ డే రోజు వివాహం చేసుకోవాలనుకున్నాయి. అది కూడా హాట్ ఎయిర్ బెలూన్‌లో. అంతేకాదు.. ఈ వివాహ వేడుకతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాలన్నది వారి ఆశయం.ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. యాభై జంటలు పెళ్లి చేసుకోవడానికి 30 హాట్ఎయిర్బెలూన్లను సిద్ధం చేసుకున్నారు. అయితే ఆరోజు విపరీతంగా మంచుకురవడం మొదలైంది. దాంతో బెలూన్లను కార్లకు అనుసంధానించారు. అవి 15 మీటర్ల కన్నా ఎత్తుకి వెళ్లడానికి వీల్లేకపోయింది. అలా మొత్తానికి పెళ్లి తంతు అయితే జరిపించారు కానీ, మంచు అవాంతరం నేపథ్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దొరుకుతుందో లేదో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







