ఆన్లైన్ మాయగాళ్ళతో మీ పిల్లలు జాగ్రత్త
- February 15, 2016
ఆన్లైన్లో మాయగాళ్ళు, నేరగాళ్ళు పెరిగిపోయారని రాయల్ ఒమన్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ ఈ మాయగాళ్ళు, నేరగాళ్ళ బారిన పడి పిల్లలు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రేప్ కేసులు కూడా వెలుగు చూస్తుండడం బాధాకరం. రాయల్ ఒమన్ పోలీస్ ఎకనమిక్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ కెప్టెన్ ఘస్సన్ అల్ జద్జలి మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా ఆడపిల్లలకు వలవేసే కేటుగాళ్ళు, తాము చెప్పిన చోటకి వారిని రప్పించి, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. మొబైల్ యాప్స్, ఇతర మార్గాల ద్వారా సోషల్ మీడియాని, ఆన్‌లైన్‌ని వినియోగించే విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలనీ, వారి చర్యలపై దృష్టిపెట్టాలని కోరారు. అనవసరమైన యాప్స్‌ని డౌన్ లోడ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ వినియోగం విషయంలో పిల్లలకు పూర్తిగా అవగాహన కల్పించాలనీ, అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలని ఘన్సన్ చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







