మిడ్ వీక్ పబ్లిక్ హాలీడేస్‌కి గుడ్ బై?
- February 15, 2016
వారం మధ్యలో వచ్చే పబ్లిక్ హాలీడేస్ ప్రొడక్టివిటీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎంపీ ఒకరు అభిప్రాయపడ్డారు. వారం మధ్యలో పబ్లిక్ హాలీడే వస్తే, దాన్ని వారాంతం వరకు పొడిగించుకోవడానికి ఎక్కువమంది ప్రయత్నిస్తున్నారనీ, దాంతో ఆ మధ్యకాలంలో ప్రొడక్టివిటీ తగ్గిపోతోందనీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 నుంచి 50 శాతానికి 'ఆబ్సెన్సీ' రేటు దిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సెలవుల్ని వారాంతానికి దగ్గరగా చేర్చి ఇవ్వడం వల్ల ప్రొడక్టివిటీ పెంచవచ్చని చెప్పారాయన. ఎంపీ అదెల్ అల్ లస్సోమీ తన వాదనలు విన్పిస్తూ కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌కి ఓ ప్రపోజల్‌ని అందజేశారు. అయితే, లూనార్ క్యాలెండర్‌ని అనుసరించి పవిత్ర దినాలు ఉంటాయనీ, వాటిని వారాంతంలో అకామడేట్ చేయడం కష్టమువుతందనే అభిప్రాయాలూ ఉన్నాయి. మార్చగలిగిన వాటిని మాత్రం వారాంతాలకు పంపడం ద్వారా ప్రొడక్టివిటీని పెంచగలమన్న ప్రపోజల్ మంచిదేనని కొందరు స్పందిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీకి స్టడీ కోసం ఈ ప్రపోజల్ పంపబడుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







