నడి రోడ్డుపై న్యూసెన్స్: మహిళ అరెస్ట్

- January 22, 2021 , by Maagulf
నడి రోడ్డుపై న్యూసెన్స్: మహిళ అరెస్ట్

మనామా:ఓ మహిళ మత్తులో తూగుతూ, రోడ్ల మీద న్యూసెన్స్ సృష్టించగా, దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆ వీడియో ఆధారంగా పోలీసులు నిందితురాలైన మహిళను అరెస్ట్ చేశారు. ఆమెను ఆఫ్రికా జాతీయురాలిగా గుర్తించారు. అరెస్టుని ధృవీకరించిన అధికారిక వర్గాలు, వీడియో ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామని అన్నారు. నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మద్యం మత్తులో ఆమె అలా చేసిందా.? ఇంకేదైనా కారణం వుందా.? అనేది విచారణలో తేలాల్సి వుంది. రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, అటుగా వస్తున్నవారిపై దాడులు చేస్తూ నిందితురాలు న్యూసెన్స్ చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లవెత్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com