పారువెల్ల || తూకపురాళ్ళు

- February 27, 2016 , by Maagulf

నీకింత గౌరవమిచ్చేందుకు

నిన్ను కొలిచేందుకు
వాళ్ళు ! ఎప్పుడూ తూకపురాళ్ళు దగ్గరే ఉంచుకుంటారు
తూగనందుకు నీకేదీ పట్టదు

అయినవాళ్ళ నుండి పొందనిది
బయటివాళ్ళ నుండి నువ్వెప్పుడూ  ఆశించవు

ఉరుములు మెరుపులు
ఎక్కడో ఉరిమినా
ఇంకెక్కడో మెరిసినా
వెక్కిరింపులు పల్లమునే చేరుతుంటాయి
నీ వైపుకే పారుతుంటాయి

నీతో వున్నందుకు
నీ నీడ కూడా తెలికైపోతుంటది
నీ ఇష్టాలు కష్టాలు  అన్నీ వట్టివే!

బంగారు విగ్రహమున్న చోట
నీకు ప్రసాదమూ  దొరక్క పోవచ్చు
కొలతలంతే ....!!

అయినా...
తూగనందుకు నువ్వెప్పుడూ బాధ పడవు

కాలమెప్పుడూ ఒకేలా ప్రవహించదని
నీకు తెలిసినందుకైనా
కాలమెప్పుడో నిన్ను కొలవకుండానే కొలిచి మొక్కుతుంది

లాభమో  నష్టమో
నీకేదీ పట్టనందుకు
నీ త్రుప్తిని కొలిచే తూకపురాళ్ళను వెతికే పనిలో
అప్పుడు  మళ్ళీ వాళ్ళే !!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com