రీమేక్ సినిమాలో బన్నీ..
- February 27, 2016
మెగా హీరోలందరూ రీమేక్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకువచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ సినిమాతోనే రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. విజయ్ హీరోగా ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను వినాయక్ దర్శతక్వంలో తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు చిరు.ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా చేరనున్నాడట. ఇటీవల తమిళ్ లో ఘనవిజయం సాధించిన కనిథన్ రీమేక్ లో నటించడానికి బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అధర్వ, కేథరిన్ థెరిస్సాలు జంటగా తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను బాలీవుడ్ లోనూ రీమేక్ చేస్తున్నారు.యంగ్ హీరో అర్జున్ కపూర్ ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సాలు లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 22న రిలీజ్ కు రెడీ అవుతోంది. సరైనోడు సినిమా రిలీజ్ తరువాత కనీథన్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







