కరోనా వ్యాక్సిన్: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
- March 13, 2021
అమరావతి:హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటినవారు ఏదైనా గుర్తింపు కార్డు చూపించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోలేకపోయినా స్వయంగా సెంటర్లకు వెళ్లి టీకా వేయించుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. 45 నుంచి 59 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలని.. ధ్రువపత్రం లేనివారు రక్త పరీక్షల రిపోర్టులు, మందుల చీటీ, ఇతర ఆధారాలు చూపిస్తే.. ఆయా ఆసుపత్రుల్లోని వైద్యులు అవసరమైన ధ్రువపత్రాన్ని ఇస్తారని వైద్యారోగ్య శాఖ తెలిపింది. అన్ని ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ వేస్తారని వైద్యాధికారులు తెలిపారు. ఆస్పత్రుల జాబితాను http://www.cowin.gov.in వెబ్సైట్లో చూడవచ్చని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం







