శ్వాసతో బ్రీత్ టెస్ట్..60 సెకన్లలో రిపోర్ట్

- March 13, 2021 , by Maagulf
శ్వాసతో బ్రీత్ టెస్ట్..60 సెకన్లలో రిపోర్ట్

యూఏఈ: కేవలం 60 సెకన్లలోనే కోవిడ్ టెస్ట్ ను పూర్తి చేసే ఆధునిక టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటోంది యూఏఈ. బ్రీథోనిక్స్ విధానంతో శ్వాస ద్వారా క్షణాల్లోనే వైరస్
తీవ్రతను అనలైజ్ చేసి రిపోర్ట్ ఇవ్వనున్నట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ వెల్లడించింది. మొహమ్మద్ బిన్ రషీద్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్, దుబాయ్ హెల్త్ అథారిటీ, బ్రీథోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం కొత్త కోవిడ్ -19 శ్వాస పరీక్ష యొక్క ఖచ్చితత్వాన్ని అంచనా వేయడానికి సంయుక్త క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా డీహెచ్ఏ పరిధిలోని నాడ్ అల్ హమర్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో బ్రీథోనిక్స్ ను ఇప్పటికే దాదాపు 2,500 మందిపై ప్రయోగాత్మకంగా పరీక్షించారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన బ్రీథోనిక్స్ విధానంలో నోటి నుంచి ప్రత్యేకంగా అమర్చిన డిస్పోసల్ మౌత్ పీస్ లోకి గాలి ఉందాలి. వెంటనే ఆ మౌత్ పీస్ లోని గాలిని స్పెక్ట్రోమీటర్ ద్వారా విశ్లేషించి వైరస్ ఆనవాళ్లను, వైరస్ తీవ్రతను విశ్లేషించి 60 సెకన్లలో కోవిడ్ రిపోర్ట్ ను రెడీ చేస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com