ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు..
- April 04, 2021
భారత వైమానిక దళంలో 1,524 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్టెనో, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్డీసీ, కార్పెంటర్, హిందీ టైపిస్టు పోస్టలు ఈ నోటిపికేషన్లో ఉన్నాయి. ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకువోచ్చునని తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫిషియల్ వెబ్సైట్ http://indianairforce.nic.inలో సంబంధిత పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 2 గా నిర్ణయించారు.
అభ్యర్థుల అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలని నిర్ణయించారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. క్వశ్చన్ పేపర్ హిందీ, ఇంగ్లీష్ మాద్యమాల్లో వస్తుంది. ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. జాబ్ జాయిన్ అయ్యే టైమ్‌లో ఒరిజినల్ సర్టిఫికెట్లు అధికారులకు చూపించాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు:
పరీక్షకు హాజరయ్య అభ్యర్థులు తప్పనిసరిగా కోవిడ్ 19 పరీక్ష చేయించుకుని ఉండాలి. కోవిడ్ 19 నెగిటీవ్ ధృవీకరణ పత్రంతో వస్తేనే పరీక్ష హాల్లోకి అనుమతించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







