వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం రూ. 300 కోట్లు : ఈటెల
- March 02, 2016
వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ప్రచారంలో భాగంగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో రూ. 300 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు. అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. రెప్పపాటు కరెంట్ పోకుండా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అని చెప్పారు.వరంగల్ కార్పొరేషన్‌కు పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఈటెల విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







