ఏటీఎం ద్వారా ఫీజుల చెల్లింపు
- March 02, 2016
బహ్రెయిన్‌లో యజమానులు, వ్యాపారవేత్తలు ఇక నుంచి న్యాబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ) బిల్స్‌ను ఎటిఎం కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఎల్ఎంఆర్ఎ డిప్యూటీ సీఈఓ షేక్ ఫవాజ్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ విషయమై మాట్లాడుతూ, పన్ను చెల్లింపుదారుల కోసం ఈ సులభతరమైన మార్గాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఎటీఎంల ద్వారా వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఎల్ఎంఆర్ఎ బిల్స్‌ను మార్చ్ 1 నుంచి చెల్లించవచ్చు. ఎల్ఎంఆర్ఎ ఫైనాన్షియల్ విభాగం దీనికి సంబంధించిన అన్ని సాంకేతికపరమైన ఏర్పాట్లనూ బ్యాంకింగ్ సెక్టార్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిచేసింది. బ్యాంకుల నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఏటీఎం కార్డుల వినియోగం ఆధారపడి ఉంటుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







