ట్రాఫిక్ జరిమానాలు చెల్లిస్తేనే వీసా పునరుద్ధరణ
- March 02, 2016
ముందు ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన అన్ని జరిమానాల బకాయిలను చెల్లిస్తేనే విదేశీయులకు వీసా పునరుద్ధరణ ఉంటుందని రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. బకాయిలు పడిన విదేశీయులకు అవి చెల్లించిన తర్వాతే దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది. జూన్ 1, 2015 నుండి విదేశీయులకు ఎవరైనా దేశం విడిచి వెళ్లడానికి ముందు కొంతకాలంగా ఆగిపోయి ఉన్న ట్రాఫిక్ జరిమానాలు చెల్లించడం తప్పనిసరి చేయబడింది. ట్రాఫిక్ జరిమానాలు చెల్లించనివారు వేరే ఇతర దేశాలకు వెళ్లేందుకు వీలు లేదు. గతంలోనే ఈ చర్య మొదలైనప్పటికి ప్రస్తుతం ఈ నియమాలను ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. ఒక ప్రజా సంబంధాల అధికారి తన కంపినీలో ఉద్యోగికి రెండేళ్ళ నివాస ముద్రను కేవలం పాత ట్రాఫిక్ జరిమానాను చెల్లించనందున పాస్ పోర్ట్ అధికారులు, రాయల్ ఒమన్ పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పాస్‌పోర్ట్ మరియు రెసిడెన్స్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఫైసల్ అల్ వహాబీ మాట్లాడుతూ ఉద్యోగ పాస్ పోర్ట్ , గుర్తింపు కార్డులు, వీసాలు, నివాసం మరియు డ్రైవింగ్ కు రహదారి అనుమతులకు సంబంధించిన పలు సేవల పరిధి ఇందులో భాగంగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







