1,053 మంది విదేశీయులకు కువైట్ దేశ బహిస్కరణ
- March 02, 2016
దక్షిణాసియా మరియు అరబ్ దేశాల నుంచి కువైట్ దేశంలో రహస్యంగా ఉన్న1,053 విదేశీ కార్మికులను తమ దేశం నుంచి దెశ బహిస్కరణ చేశారు. వీరు జ్లీబ్ అల్ శుయుఖ్ ప్రాంతంలో నివసించేవారు రాజధానిలో ప్రాంతంలో జరిగిన ఈ ఆకస్మిక దాడిలో వీరిని అదుపులోకి తీసుకొన్నారు, మంగళవారం నిర్వహించిన ఈ దాడి సమయంలో 4.015 విదేశీయుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేశారు, వారు దేశంలో అనుమతికి మించి అత్యధిక కాలం నిర్ధారించడానికి వారి వారి పత్రాలను పరిశీలన జరిపారు వీరిలో 1,053 మంది విదేశీయులకు కాల పరిమితి ముగిసిపోయినప్పటకి అక్రమంగా కువైట్ లో నివసిస్తున్నట్లు గుర్తించారు. అంతర్గత వ్యవహారాల శాఖ పోలీసులు అధ్వర్యంలో జరిగిన పత్రాల పరిశీలన విజయవంతమైంది. ఇదే సమయంలో ఏ ఒక్కరు పారిపోకుండా ఆ ప్రాంతంలో గట్టి పహారా ఏర్పాటు చేశారు. కువైట్ గత నెలలో ఇదే తరహ తనిఖీలో 3,548 మంది విదేశీయుల పత్రాలను పరిశీలించి అందులో 1,170 మంది అనుమతి లేని విదేశీయులను అదుపులోనికి తీసుకొన్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







