కరోనాకు హోమియోపతి వ్యాక్సిన్

- April 16, 2021 , by Maagulf
కరోనాకు హోమియోపతి వ్యాక్సిన్

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ మరో ముందడుగు వేసింది.హోమియోపతి వ్యాక్సిన్ తో కరోనాను తరిమేందుకు సిద్ధమైంది. ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా కట్టడికి హోమియో వ్యాక్సిన్ వాడలేదు.. భారత్ మాత్రం హోమియో టీకా ఇచ్చేందుకు సిద్దమవుతుంది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. కాగా ఈ వ్యాక్సిన్ ని లైఫ్ ఫోర్స్ హోమియోపతి అండ్ బయోసిమిలా కంపెనీ తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ 62 శాతం ప్రభావం చూపుతుందని ఆ సంస్థ అధిపతి డాక్టర్ రాజేష్ తెలిపారు.

వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో తాము తయారు చేసిన సోనోడ్ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మనిషిలో సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతూ, వ్యాధిలక్షలను తగ్గించేది టీకా అని, సోనోడ్ కూడా టీకానే అని అంటున్నారు తయారీదారులు. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హోమియో నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత్ లో రెండు టీకాలను ఇస్తున్నారు. తాజాగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కు అనుమతులు లభించాయి.. దీనికి సోనోడ్ కూడా తోడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com