కోవిడ్ ప్రభావం తగ్గే వరకు ఈ ప్రదేశాలకి వెళ్ళద్దు
- April 18, 2021
కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు.ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి కేసులు అధికంగా నమోదవుతున్నాయి.అయితే ప్రజలు ఈ ప్రదేశాలకి వెళ్లకుండా ఉండటమే మంచిది. కరోనా మీకు సోకకుండా ఉండాలి అంటే ఈ ప్రదేశాలకు వెళ్ళకండి.
మార్కెట్ మరియు మాల్స్:
మార్కెట్ కి మాల్ కి వెళ్లడం మానేయడం మంచిది. మాల్ కి వెళ్లడం వల్ల వందలో జనం ఉంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.
పార్టీలకు వెళ్లడం:
కరోనా తగ్గుముఖం పట్టే వరకు పార్టీలని ఎవాయిడ్ చేయడం మంచిది. ప్రతి రోజూ చాలా మంది పార్టీలుకి వెళుతూ ఉంటారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా వీటి కారణంగా ఎక్కువ మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలి అంటే ఈ ప్రదేశాలకు దూరంగా ఉండటం మేలు.
సూపర్ మార్కెట్:
మీరు ఒకవేళ సరుకులు తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్ కి వెళ్తుంటే దానిని ఎవాయిడ్ చేయడం మంచిది. వీలైనంత వరకు ఆన్లైన్లో గ్రోసరీ షాపింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువ సేపు క్యూలో నిలబడడం, జనం మధ్యలో నిలబడడం లాంటివి చేయక్కర్లేదు.
హిల్ స్టేషన్స్:
వేసవి కాలం వచ్చేసింది వేసవిలో వీకెండ్ వచ్చిందంటే చాలు అందరికీ హిల్ స్టేషన్స్ కి వెళ్లిపోవడం అలవాటు. అలానే చాలామంది కుటుంబంతో టూరిస్ట్ ప్రదేశాలకి వెళుతుంటారు మీరు కూడా వెళ్దామని అనుకుంటే ఆ ప్లాన్ ని ఆపడం మంచిది. వీలైనంత వరకు ఇంట్లోనే కూర్చోవడం మేలు.
పార్క్ లేదా ప్లేగ్రౌండ్ :
పిల్లల్ని పార్కుల్లో కూర్చోబెట్టడం కంటే ఇంట్లో ఆడించటం లేదా మొబైల్, ల్యాప్‌టాప్ వంటివి ఇవ్వడం మంచిది. పార్క్ లేదా మైదానాలలోకి పంపించొద్దు. అక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
ఫిట్నెస్ సెంటర్:
మీరు ప్రతి రోజూ జిమ్ కి వెళ్తున్నారా..? అయితే కొన్ని రోజుల వరకు వెళ్ళకండి. ఎందుకు అంటే ఫిట్నెస్ సెంటర్ ద్వారా కూడా కరోనా వస్తుంది దానికి బదులుగా మీరు ఇంట్లో కూర్చుని వ్యాయామం చేయడం మంచిది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







