స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 320 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
- April 18, 2021
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదలవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. కోచ్, అసిస్టెంట్ కోచ్ విభాగాల్లో దాదాపు 320 ఖాళీల భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో కోచ్ పోస్టులు 100, అసిస్టెంట్ కోచ్ పోస్టులు 220 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 20లోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. కోచ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,05,000-రూ. 1,50,000 వరకు వేతనం చెల్లించనున్నారు. అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.41,420 వేల నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లించనున్నారు.
విద్యార్హతల వివరాలు..
కోచ్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు SAI, NS NIS లేదా గుర్తింపు పొందిన ఇతర ఏ ఇండియన్/ఫారెన్ యూనివర్సిటీలో కోచింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఒలంపిగ్ గేమ్స్ లో మెడల్ విన్నర్ కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత లేదా ఒలంపిక్ లో రెండు సార్లు పాల్గొన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అసిస్టెంట్ కోచ్: SAI, NS NIS లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కోచింగ్ లో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఒలంపిక్ లేదా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వారు లేదా ద్రోణాచార్య అవార్డు గ్రహీత కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.
వయో పరిమితి:
కోచ్: 45 ఏళ్లు
అసిస్టెంట్ కోచ్-40 ఏళ్లు
Official Website- https://sportsauthorityofindia.nic.in/
దరఖాస్తు విధానం:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు అధికారిక వెబ్ సైట్లో ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే ఏప్రిల్ 20 వ తేదీ నుంచి అప్లికేషన్ లింక్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉండనుంది. అప్లికేషన్లను సబ్మిట్ చేసిన అనంతరం అభ్యర్థులు ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







