విడాకులుకి అప్లై చేసిన : మాజీ హీరోయిన్ ప్రేమ
- March 02, 2016
తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన ప్రేమ గుర్తుండే ఉండి ఉంటుంది. ప్రేమకు టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉంది. టాప్ హీరోలు అందరితోను నటించిన ప్రేమకు వెంకటేష్ తో నటించిన 'ధర్మచక్రం' సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది.అయితే ఈమె పెళ్ళి చేసుకున్న తరువాత గత కొన్ని సంవత్సరాలుగా ఈమె వార్తలు మీడియాలో కనిపించడం లేదు. అయితే మరోసారి ఆమె వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ సారి ఆమె తన భర్త నుంచి విడాకులు కోరుతూ వార్తలకి ఎక్కింది.వివహాల్లోకి వెళితే...కెరీర్ లో వెలుగుతున్న సమయంలోనే ( 2006) ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇప్పుడు విభేధాలతో వారిద్దరూ విడిపోవాలనుకున్నారు.తన భర్త జీవన్ అప్పచ్చు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈమేరకు నగరంలోని ఫ్యామిశివరాజ్కుమార్ నటించిన సవ్యసాచి అనే చిత్రం ద్వారా ప్రేమ కన్నడచిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆమె తెలుగులోనూ చాలా సినిమాలు చేసారు. ముఖ్యంగా ఉపేంద్ర దర్శకత్వంలో నిర్మితమైన ఓం సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది.కొంతకాలం న్యూజిలాండ్ లో ఉండి ఈమధ్యనే కొద్దికాలం క్రితం తిరిగి బెంగుళూరుకు తిరిగి వచ్చింది. తనకు మహేష్ బాబు చిత్రం 'శ్రీమంతుడు' సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని తాను వదులుకున్నానని తెలియ చేసింది ప్రేమ.ఈసినిమా దర్శకుడు కొరటాల శివ తనను మహేష్ బాబుకి మదర్ క్యారెక్టర్లో నటించాలని కోరాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ పాత్ర తనకు నచ్చకపోవటంతో , తానూ తిరస్కరించానని ప్రేమ తెలియచేసిందిదీనితో ఆ ఆఫర్ కాస్తా సుకన్య సొంతమైందట.ప్రస్తుతం తెలుగు పరిశ్రమనుంచి సరైన రోల్స్ వస్తే నటించేందుకు తాను రెడీ అంటూ మనసులోని మాటను బయటపెట్టింది . కానీ ఆ సినిమాల స్థాయి 'ఇంగ్లీష్ వింగ్లీష్' లో శ్రీదేవి నటించిన క్యారెక్టర్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. అంటే విడాకులు తీసుకుని...నదియా, శ్రీదేవి, రమ్యకృష్ణలతో పాటుగా హీరోయిన్ ప్రేమ కూడ రంగంలోకి దిగాలని నిర్ణయించుకుందన్నమాట.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







