అక్షయ్ తో రెండో సినిమా : క్రిష్
- March 02, 2016
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్(రాధా కృష్ణ జాగర్లమూడి) బాలీవుడ్ లోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా గబ్బర్ సినిమాను తెరకెక్కించిన క్రిష్, మంచి విజయం సాధించాడు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నక్రిష్ ఇప్పుడు మరోసారి అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.బాలీవుడ్ లో తొలి ప్రయత్నంగా సీరియస్ సినిమాను తెరకెక్కించిన క్రిష్, ఈ సారి మాత్రం ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను రెడీ చేస్తున్నాడు. కంచె సినిమాతో మంచి విజయం సాధించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ తరువాత వరుణ్ తేజ్ హీరోగా మరో సినిమా చేయాలని భావించాడు.అయితే ఆ సినిమా అనుకున్న సమయానికి సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించకపోవటంతో మరోసారి బాలీవుడ్ బాట పట్టాడు.ట్రినిటీ పిక్చర్, ఇరోస్ ఇంటర్ నేషనల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తమిళంలోనూ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో హీరో ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







