కొత్త వెర్షన్ (49) తో 'గూగుల్ క్రోమ్...
- March 03, 2016
విండోస్, ఓఎస్ ఎక్స్, లైనక్స్ యూజర్లకు 'గూగుల్ క్రోమ్' ఇంటర్నెట్ బ్రౌజర్ కొత్త వెర్షన్ (49) నూతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఇప్పుడు ఆయా ప్లాట్‌ఫాంల వినియోగదారులు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్‌లో వెబ్ పేజీలను స్మూత్‌గా స్క్రోల్ చేసుకునేందుకు వీలుంది. దీంతోపాటు దాదాపు 26కు పైగా సెక్యూరిటీ ఫిక్స్‌లను ఇందులో అందిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్నెట్ స్పీడ్‌ను బట్టి నెట్ వినియోగదారులకు లైట్ వెర్షన్ వెబ్ పేజీలను అందించేందుకు వీలుగా వెబ్‌సైట్ల యజమానులకు కొత్త రకం సాఫ్ట్‌వేర్ ఏపీఐలను అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా ఆయా సైట్లలో ఉండే ఆడియో, వీడియో, ఫ్లాష్ తదితర ఫైల్స్‌ను ఓపెన్ చేయకుండా కేవలం బేసిక్ వెబ్ పేజీని మాత్రమే ఓపెన్ చేసేందుకు వీలుంటుంది.ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న పీసీ యూజర్లకు క్రోమ్‌కు చెందిన ఈ కొత్త వెర్షన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని గూగుల్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెర్షన్ కేవలం పీసీ యూజర్లకు మాత్రమే లభిస్తుండగా త్వరలోనే అప్‌డేటెడ్ క్రోమ్ బ్రౌజర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందించనున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







