ధన్ రాజ్ ఇంటి గృహప్రవేశ ఫంక్షన్స్ కు హాజరై న బ్రహ్మీ
- March 03, 2016
టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న బ్రహ్మీ కమెడియన్ గా ఒక రోజుకు 5 లక్షల పారితోషికం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే యంగ్ కమెడియన్స్ హవా మధ్య బ్రహ్మనందం క్రేజ్ పూర్తిగా తగ్గి పోవడంతో బ్రహ్మీ పని అయిపోయింది అన్న కామెంట్స్ మొదలయ్యాయి. ఈ కామెంట్స్ బ్రహ్మానందం వరకు వెళ్ళడంతో బ్రహ్మానందం తన వ్యవహార శైలిలో చాల మారినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మీడియాని పెద్దగా పట్టించుకోని బ్రహ్మానందం ఆ మధ్య జరిగిన తన పుట్టినరోజుకు చాలామంది మీడియా ప్రతినిధులను పిలిచి వారికి మంచి పార్టీ ఇచ్చినట్లుగా కూడ వార్తలు వచ్చాయి. అంతేకాదు తన వద్దకు వస్తున్న మీడియా సంస్థ ప్రతినిధులతో నవ్వుతూ మాట్లాడటమే కాకుండా ఈమధ్య చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా హాజరవుతు అందరికీ షాక్ ఇస్తున్నాడు.లేటెస్ట్ గా కమెడియన్ ధన్ రాజ్ ఇంటి గృహప్రవేశ ఫంక్షన్స్ కు హాజరై అతడిని అతడి కుటుంబ సభ్యులను అభినందించడం అందరికీ షాక్ ఇచ్చింది. దీనికి కారణం బ్రహ్మీ గతంలో చిన్న తారలు జరుపుకునే ఏ ఫంక్షన్స్ కు వ్యక్తిగతంగా బ్రహ్మానందం హాజరైన సందర్భాలు చాల అరుదు. దీనితో బ్రహ్మానందం మారిపోయాడు అంటూ ఫిలింనగర్ లో సెటైర్లు పడుతున్నాయి. ఈ పరిస్థుతులు చూస్తూ ఉంటే రానున్న రోజులలో చుక్కలను తాకుతున్న బ్రహ్మీ పారితోషికం తగ్గించుకున్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. బ్రహ్మీకి అవకాశాలు తగ్గిపోయాయి అని వార్తలు వస్తున్నా సమ్మర్ రేస్ కు వస్తున్న భారీ సినిమాలు 'సర్దార్ గబ్బర్ సింగ్' 'బ్రహ్మోత్సవం' సినిమాలలో బ్రహ్మీ పాత్ర ఉండటం బట్టి ఇంకా బ్రహ్మానందం క్రేజ్ కొనసాగుతూనే ఉంది అని అనిపించడం సహజం..
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







