వెజిటబుల్ ఆమ్లెట్
- March 03, 2016
కావలసిన పదార్థాలు: గుడ్లు - నాలుగు, బీట్ రూట్ - ఒకటి(చిన్నది) క్యాప్సికమ్ - ఒకటి, క్యాబేజి తురుము- రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, టమోటాలు - రెండు, బీన్స్ - నాలుగు, పచ్చిమిరపకాయలు - ఆరు, కొత్తిమీర కట్ట - ఒకటి, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా కూరగాయ ముక్కల్ని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి బాగా కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి వెంటనే దించేయాలి. గుడ్డు సొనని ఒకసారి మిక్సీలో వేసుకుని ఆమ్లెట్ వేయాలి.(ఆమ్లెట్ లావుగా రావాలంటే మిక్సీలో వేసుకోవాలి) ఆమ్లెట్‌పై కూరముక్కల్ని చల్లి చివర్లో కొత్తిమీర తురుము వేసి ఒకవైపుకి మడిచి సర్వ్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







