సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది..

- March 03, 2016 , by Maagulf
సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది..

ముల్హీన్ అన్ డెర్ రుర్ (జర్మనీ): జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం దాదాపు ఏకపక్షంగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఏడో సీడ్ సింధు 21-9, 21-17 స్కోరుతో మిషెల్లీ లీ (కెనడా)ని చిత్తు చేసింది. గత రెండు మ్యాచ్‌లలో లీ చేతిలో ఓడిన సింధు ఈ సారి సత్తా చాటింది. ఆరంభంనుంచే దూకుడుగా ఆడిన హైదరాబాద్ షట్లర్, ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. తొలి గేమ్‌ను సింధు సునాయాసంగా గెలుచుకోగా, రెండో గేమ్‌లో మిషెల్లీ కాస్త పోటీనిచ్చింది. ఈ మ్యాచ్ 32 నిమిషాల్లో ముగిసింది.పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు.
రెండో రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 15-21, 21-6, 21-16తో ఎరిక్ మీజ్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. అయితే మరో ఆటగాడు సమీర్ వర్మ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. లీ డాంగ్ కీన్ (కొరియా) చేతిలో సమీర్ 21-8, 19-21, 19-21 తేడాతో పరాజయంపాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో కూడా భారత జోడి మను అత్రి-సుమీత్ రెడ్డి టోర్నీనుంచి నిష్ర్కమించింది. చైనీస్ తైపీ జంట లీ షెగ్ ము-సై చియా సిన్ 21-10, 21-10తో మను-సుమీత్‌ను చిత్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com