‘ఇందువదన’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- May 03, 2021
హైదరాబాద్: డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యపీ డేస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్.ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన కానీ ఈ యంగ్ హీరోకు ఆశించినంతగా అవకాశాలు రాలేదు.దీంతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ.. సరైన హిట్ కోసం ఎదురుచూసాడు. ఇక ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన వరుణ్ సందేశ్.. బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గోని మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ హీరో సరికొత్తగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.ఇందులో భాగంగా తాను ప్రస్తుతం నటిస్తున్న ఇందువదన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్..
ఇక తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్ పోస్టర్ కళాత్మకంగా ఉండి ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లు వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి కాస్తా బోల్డ్ గా కనిపించారు. అంతేకాకుండా ఈ పోస్టర్ లో వరుణ్ సందేశ్ సరికొత్త లుక్కులో కనిపించారు. విడుదలైన క్షణం నుంచే ఈ పోస్టర్‌కి మంచి స్పందన వస్తుంది. శ్రీబాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై నైనిష్య, సాత్విక్ సమర్పణలో MSR దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శివ కాకాని సంగీతాన్ని అందిస్తుండగా.. కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









