రెండు నెలల పాటు కరెంటు బిల్లులు చెల్లించక్కర్లేదు: కేరళ సీఎం
- May 05, 2021
కేరళ: కరోనా మహమ్మారి అందరి జీవితంపై ప్రభావాన్ని చూపుతోంది. ఎంతోమంది జీవనోపాధిని కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల వరకు కరెంట్ బిల్లులను వసూలు చేయడం లేదని చెప్పారు. పెండింగ్ బిల్లులు కట్టాలనే ఒత్తిడి కూడా ఉండదని అన్నారు. ఇదే సమయంలో బ్యాంకులకు కూడా కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రజలు ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను అనుభవిస్తున్నారని... వారి నుంచి లోన్ల రికవరీని బంద్ చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు పోలీసులు అన్ని విధాలా సహకరిస్తారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంపై పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, రాష్ట్రానికి వెయ్యి టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను, 75 లక్షల డోసుల వ్యాక్సిన్లను పంపాలంటూ ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. ఇప్పటికిప్పుడే రాష్ట్రానికి 500 టన్నుల ఆక్సిజన్ అవసరమని... రెండో విడతలో మరో 500 టన్నుల ఆక్సిజన్ అందించాలని కోరారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







