కోవిడ్ 19 వ్యాక్సిన్ సినోవాక్ కు WHO అత్యవసర ఆమోదం

- June 02, 2021 , by Maagulf
కోవిడ్ 19 వ్యాక్సిన్ సినోవాక్ కు WHO అత్యవసర ఆమోదం

జెనీవా: కోవిడ్ నియంత్రణ కోసం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ జాబితాలో సినోవాక్ కూడా చేరింది. అత్యవసరంగా ఆమోదించే కోవిడ్ వ్యాక్సిన్ జాబితాలో సినోవాక్ ను కూడా చేర్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. రెండు డోసుల సినోవాక్ కోవిడ్ ను ఎదుర్కొవటంలో సమర్ధవంతంగా పని చేస్తుందని వెల్లడించింది. సినోవాక్ వినియోగ దేశాల నుంచి సేకరించిన సమాచారం మేరకు వృద్ధుల్లో కూడా వ్యాక్సిన్ సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. అయితే...సినోవాక్ క్లినికల్ ట్రయల్స్ లో వృద్ధులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారని, యువకులే ఎక్కువ సంఖ్యలో పాల్గొవటం వల్ల 60 ఏళ్లకు పైబడిన వారికి సినోవాక్ ను సిఫార్సు చేయటం లేదని WHO వెల్లడించింది. ఇదిలాఉంటే..కోవాక్స్ పేరుతో పేద దేశాలకు వ్యాక్సిన్ అందిస్తున్న ఐక్యరాజ్యసమితి..కోవాక్స్ ప్రొగ్రాంలో సినోవాక్ ను చేర్చలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com