ప్రైవేట్ సంస్థలకు మరోసారి ప్రోత్సాహకాలను ప్రకటించిన దుబాయ్
- June 10, 2021
దుబాయ్: కోవిడ్ మహమ్మారితో తలెత్తిన సంక్షోభాన్ని తట్టుకొని ఆర్ధిక వ్యవస్థ నిలబడేలా దుబాయ్ మరోసారి ప్రైవేట్ రంగానికి ఊరట కలిగించే ప్రకటన చేసింది. ప్రైవేట్ సంస్థల ప్రారంభానికి అవలంభించాల్సిన విధానాలకు అయ్యే ఖర్చులో మూడో వంతు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ విధానాలను 30 శాతం తగ్గించాలని తాజా ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ ఆర్ధిక స్థిరత్వం సాధించటంతో పాటు..కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రైవేట్ రంగం తిరిగి పుంజుకునే లక్ష్యానికి అనుగుణంగా ఈ చర్యలు చేపట్టింది. దుబాయ్ ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రూలర్ ఆశయాలకు అనుగుణంగా ఇప్పటికే ప్రవైట్ రంగానికి పలు మార్లు ఉద్దీపన ప్యాకేజీలు, పలు ప్రొత్సహాకాలు, రాయితీలు ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ సంక్షోభం పరిశ్రామిక రంగం, ఉపాధి అవకాశాలపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపకుండా నివారించేందుకు ప్రైవేట్ రంగానికి మద్దతుగా ఇప్పటికే Dh395 మిలియన్ల ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రకటించింది. మొత్తం ఐదు ప్యాకేజీల్లో భాగంగా ఐదో ప్యాకేజీగా Dh 7.1 మిలియన్లను లేటెస్ట్ గా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని సంస్థలు పరస్పరం సమన్వయంతో ముందుకు వెళ్తూ దుబాయ్ ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు దోహదపడాలని షేక్ హమ్దాన్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్' లో దుబాయ్ ని లీడర్ గా నిలబెట్టాలన్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి భవిష్యత్తులోనూ అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







