వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరిన బహ్రెయిన్

- June 10, 2021 , by Maagulf
వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరిన బహ్రెయిన్

బహ్రెయిన్: కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశంలోని పౌరులు, ప్రవాసీయులు తమ వంతు బాధ్యతగా వ్యాక్సిన్ పొందాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హత ఉన్న ప్రజల్లో ఇంకా 19% మంది ఇంకా రిజిస్టర్ చేసుకోలేదని కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. వ్యాక్సిన్ పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. రోజు రోజుకీ వైరస్ వేరియంట్లు పుట్టుకొస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, తమను తాము రక్షించుకోవటంతో పాటు సమాజ ఆరోగ్య భద్రత కోసం అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రత్యామ్నాయన మార్గమని, వ్యాక్సిన్ ద్వారా ఇన్ఫెక్షన్ తీవ్రత, కోవిడ్ విస్తృతి రేటు తగ్గుతుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com