ఐసిఎ యూఏఈ స్మార్ట్ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ ఐడీ

- June 10, 2021 , by Maagulf
ఐసిఎ యూఏఈ స్మార్ట్ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ ఐడీ

యూఏఈ: యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ (ఐసిఎ), ఎమిరేట్స్ ఐడీకి సంబంధించి యూఏఈ స్మార్ట్ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో కొత్త జారీ విధానాన్ని ప్రారంభించింది. క్యుఆర్ కోడ్ ద్వారా ప్రాసెస్ జరుగుతుంది. ఐడీ దరఖాస్తుదారులు, ఇ-వెర్షన్ ఉపయోగించి అన్ని ప్రభుత్వ సర్వీసుల్ని పొందవచ్చు. ఫిజికల్ కార్డులు వచ్చేదాకా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఫిజికల్ కార్డు తరహాలోనే ఈ విధానం కూడా ఉపయోగపడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com