CDACలో ఖాళీలు
- June 30, 2021
న్యూ ఢిల్లీ: కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ (CDAC) ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఇండియన్ అటానమస్ హోదా కలిగిన సైంటిఫిక్ సొసైటీగా పేరొందిన ఈ సంస్థ పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశానికి కావాల్సిన సూపర్ కంప్యూటర్స్, వాటి అభివృద్ధిని సీడీఏసీ పర్యవేక్షిస్తుంది. దేశంలో 12 నగరాల్లో బ్రాంచ్‌లు ఉండగా, పుణె ముఖ్య కేంద్రంగా అన్ని రకాల కార్యకలాపాలు నిర్వహిస్తుంది. CDAC సంస్థ విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి కోర్సులపై శిక్షణ ఇవ్వడమే కాకుండా సూపర్ కంప్యూటర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులపై సర్టిఫైడ్ కోర్సులను అందిస్తోంది. బిగ్ డేటా అనలిటిక్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, VLSIలపై పీజీ, డిప్లొమా కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది. దీంతోపాటు ఖాళీగా ఉన్న కొన్ని పోస్టులను భర్తీ చేసేందుకు తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను తాజా రిక్రూట్‌మెంట్‌లో సీడీఏసీ భర్తీ చేయనుంది. ఇందుకు దరఖాస్తు ప్రక్రియ సైతం ప్రారంభమైంది. మొత్తం 14 ఖాళీలు ఉండగా, 5 పోస్టులు పుణె, 8 పోస్టులు ముంబై, ఒక పోస్టు హైదరాబాద్ బ్రాంచ్ లలో ఉన్నాయి.
సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వయోపరిమితి 35 ఏళ్ళు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వయోపరిమితి 30 ఏళ్ళుగా ఉంది. పీహెచ్ కేటగిరిలో అసిస్టెంట్ పోస్టులకు వయోపరిమితి 45 ఏళ్ళు. రాత పరీక్ష తేదిని ఈ-మెయిల్ ద్వారా అభ్యర్థులకు తెలుపుతారు.
అభ్యర్థులు ముందుగా సీడీఏసీ అధికారిక వెబ్‌సైట్ అయిన https://www.cdac.in/ ఓపెన్ చేయాలి. కెరీర్స్ సెక్షన్‌లో కరెంట్ ఓపెనింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీకు అర్హత కలిగిన పోస్టుల నోటిఫికేషన్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత కనిపించే Apply Now ఆప్షన్‌పై క్లిక్ చేసి, మూడు దశల్లో దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. మొదటి దశలో వ్యక్తిగత వివరాలు, రెండో దశలో విద్యార్హతల వివరాలు, మూడో దశలో పేమెంట్ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకోవాలి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ జూలై 10 వరకు ఉంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









