గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో విజేతల సందడి..
- November 29, 2026
గోవాలో ఘనంగా నిర్వహించిన 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI 2026) నవంబర్ 28న ముగిసింది. ‘స్టోరీస్ వితౌట్ బోర్డర్స్’ (Stories Without Borders) ఇతివృత్తంతో నవంబర్ 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిన చిత్రాలు, దర్శకులు, నటీనటులు ఈ వేడుకల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈసారి భారతీయ సినిమాకు కూడా అంతర్జాతీయ వేదికపై మంచి గౌరవం దక్కింది. ముఖ్యంగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’ చిత్రానికి ఉత్తమ నటుడిగా సిల్వర్ పీకాక్ అవార్డును అందుకున్నారు.
రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు
‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’ చిత్రంలో అద్భుత నటనకు రిషబ్ శెట్టిని అంతర్జాతీయ జ్యూరీ ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. ఆయనకు సిల్వర్ పీకాక్ పురస్కారం అందించారు. అంతేకాకుండా, ఇదే చిత్రానికి జ్యూరీ ప్రత్యేక ప్రస్తావన (Special Mention) కూడా లభించింది. రిషబ్ శెట్టి నటనలోని భావోద్వేగాలు, శారీరక అభినయం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాయని జ్యూరీ ప్రశంసించింది.
‘హనుమాన్ అంశ్’కు ఉత్తమ తొలి దర్శకుడి అవార్డు
భారతీయ చలనచిత్ర విభాగంలో ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును డాక్టర్ విశాల్ చతుర్వేది అందుకున్నారు. నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రయాణం నేపథ్యంగా తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. మరోవైపు, ఓటీటీ విభాగంలో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించిన ‘మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ’ ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డును గెలుచుకుంది.
అంతర్జాతీయ విభాగంలో ‘Aquí’కి గోల్డెన్ పీకాక్
IFFI 2026 ప్రధాన అంతర్జాతీయ పోటీలో 15 చిత్రాలు పోటీపడ్డాయి. వీటిలో పోర్చుగల్, ఫ్రాన్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ‘Aquí’ ఉత్తమ చిత్రంగా నిలిచి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి టియాగో గుడెస్ దర్శకత్వం వహించగా, పాలో బ్రాంకో నిర్మించారు. విజేత చిత్రానికి రూ.51 లక్షల నగదు బహుమతి అందించారు. ఈ చిత్ర ప్రధాన నటుడు మనోలో సోలో ఇటీవల కన్నుమూయడంతో జ్యూరీ ఆయనను ప్రత్యేకంగా స్మరించుకుంది. జర్మన్ దర్శకుడు వోల్కర్ ష్లోన్డార్ఫ్ ‘విజిటేషన్’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డును అందుకున్నారు. ‘ది మెల్ట్‌డౌన్’ చిత్రంలో నటనకు మాయా ఓరూర్కే ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు.
IFFI 2026 Awards:అవార్డుల పూర్తి జాబితా
ప్రధాన అంతర్జాతీయ పోటీ పురస్కారాలు:
- ఉత్తమ చిత్రం – గోల్డెన్ పీకాక్: ‘Aquí’ – దర్శకుడు టియాగో గుడెస్, నిర్మాత పాలో బ్రాంకో (పోర్చుగల్, ఫ్రాన్స్).
- ఉత్తమ దర్శకుడు – సిల్వర్ పీకాక్: వోల్కర్ ష్లోన్డార్ఫ్ – ‘విజిటేషన్’.
- ఉత్తమ నటుడు – సిల్వర్ పీకాక్: రిషబ్ శెట్టి – ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’.
- ఉత్తమ నటి – సిల్వర్ పీకాక్: మాయా ఓరూర్కే – ‘ది మెల్ట్‌డౌన్’.
- ఉత్తమ తొలి ఫీచర్ చిత్ర దర్శకుడు – సిల్వర్ పీకాక్: బెరెంగర్ థౌయిన్ – ‘ది గోల్డెన్ ఏజ్’.
- ప్రత్యేక జ్యూరీ అవార్డు – సిల్వర్ పీకాక్: లోరెంజో ఫెర్రో, లూకాస్ ఎ. విగ్నేల్ – ‘ది రివర్ ట్రైన్’.
- ప్రత్యేక ప్రస్తావన: ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’.
ఇతర విభాగాల పురస్కారాలు:
- భారతీయ చలనచిత్రంలో ఉత్తమ తొలి దర్శకుడు: డాక్టర్ విశాల్ చతుర్వేది – ‘హనుమాన్ అంశ్’.
- ఉత్తమ వెబ్ సిరీస్ (OTT): ‘మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ’ – దర్శకుడు రాబీ గ్రేవాల్.
- ICFT-UNESCO గాంధీ మెడల్: ‘రహ్మా’ – దర్శకుడు ఫైసల్ సోయ్సల్ (టర్కీ).
ఇలా 57వ IFFI వేడుకల్లో భారతీయ, అంతర్జాతీయ చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను అందుకున్నాయి. రిషబ్ శెట్టి విజయం, ‘కాంతార’కు లభించిన ప్రత్యేక గుర్తింపు ఈ ఏడాది చిత్రోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- ఏటీఎం వినియోగదారులకు అలర్ట్..ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
- గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో విజేతల సందడి..
- అమరావతిలో బెడ్ఫోర్డ్ స్కూల్ రెండో అంతర్జాతీయ క్యాంపస్
- కువైట్‌లో ప్రవాసులకు బ్యాంకు రుణాలపై కొత్త ఆంక్షలు..!!
- అరేబియా ఎడారిలో ప్రాచీన మానవుల నివాస రహస్యాలు..!!
- దుబాయ్‌లో అపార్ట్మెంట్ CCTV ఫుటేజీని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయవచ్చా?
- ఆరోగ్య రంగంలో ఏఐ.. ఖతార్ లో కీలక కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..ప్రజలకు సివిల్ డిఫెన్స్ హెచ్చరికలు..!!
- పెంపుడు జంతువులను వదిలేస్తే BD5000 జరిమానా..!!
- నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సమీక్షించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్..







