పర్మిట్ లేకుండా బాణాసంచా కాలిస్తే జైలు, Dh100,000 ఫైన్
- July 22, 2021
యూఏఈ: ఈద్ అల్ అధా పండగ సాకుతో అనుమతి లేకుండా బాణాసంచా కాలిస్తే జైలు శిక్ష తప్పదని అబుధాబి పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా హద్దుమీరి పటాసులు కాల్చితే ఏడాది తగ్గకుండా జైలు శిక్ష, Dh100,000 తగ్గకుండా జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక లైసెన్స్ లేకుండా బాణాసంచా అమ్మకాలు నిర్వహించినా, దిగుమతి, ఎగుమతి చేసినా, తయారు చేసినా, బాణాసంచా రవాణా చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తామని, అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానా రెండు విధిస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు బాణాసంచా కొనుగోలు చేయకుండా, ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా నచ్చచెప్పాలని, పటాసులకు బదులు ఇతర ప్రత్యామ్నాయ ఆటల వైపు ప్రొత్సాహించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాలిస్తే వెంటనే 999, 8002626కి ఫోన్ చేసిగానీ, అమన్ సర్వీస్ ద్వారాగానీ తమకు సమాచారం అందించాలని, వివరాలు అందించిన వారి వివరాలను కాన్ఫిడెన్షయల్ గా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







