2021లో అత్యంత వేడివంతమైన నెలగా ఆగస్ట్
- July 24, 2021
సౌదీ: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) అధికార ప్రతినిథి హుస్సేన్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, రానున్న ఆగస్ట్ నెల, 2021లోనే అత్యంత వేడివంతమైన నెల కాబోతోందని చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గగానే ఉష్ణోగ్రతలు పెరడం ప్రారంభమవుతుందని అన్నారాయన. సౌదీ అరేబియా తీర ప్రాంతాల్లో హ్యుమిడిటీ అత్యంత ఎక్కువగా వుండబోతోంది. నిజ్రాన్ మరియు రియాద్‌లలో వీటి ప్రభావం చాలా ఎక్కువ. 1991 తరహాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎన్సిఎంకి చెందిన క్లైమేట్ సర్వీస్ డిపార్టుమెంట్ కొన్ని వారాల క్రితమే హెచ్చరించిన విషయం విదితమే. కాగా, గడచిన మూడేళ్ళలో ఎన్నడూ లేని విధంగా గత మే నెలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







