స్మార్ట్ ఫోన్ తో రెసిడెన్సీ పర్మిట్లు
- July 25, 2021
యూఏఈ: యూఏఈ రెసిడెన్సీ పర్మిట్ కోసం ఇక నుంచి ప్రభుత్వ కేంద్రాలకు తిరగాల్సిన పని లేదు. మీరు ఉన్న చోటు నుంచే రెసిడెన్సీ పర్మిట్ కు అప్లై చేయవచ్చు. రెసిడెన్సీ స్టిక్కర్లు పొందవచ్చు. ఇందుకు అనుగుణంగా 'ఐసీఏ యూఏఈ స్మార్ట్ ' యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది యూఏఈ.http://ica.gov.aeవెబ్ సైట్ ద్వారా కూడా ఆన్ లైన్లోనే రెసిడెన్సీ పర్మిట్ కు అప్లై చేసుకోవచ్చని జాతీయ గుర్తింపు అధికార విభాగం-ICA స్పష్టం చేసింది. మొత్తం 6 స్టెప్పుల్లో అప్లికేషన్ ప్రక్రియ ముగిసిపోతోంది. ముందుగా యాప్ లో గానీ, వెబ్ సైట్లోగానీ లాగిన్ అయి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రెసిడెన్సీ పర్మిట్ జారీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత పర్మిట్ పొందేందుకు కావాల్సిన డాక్యుమెంట్లను అటాచ్ చేయాలి. దరఖాస్తుదారిడి పూర్తి వివరాలను అప్ డేట్ చేయాలి. ఆ తర్వాత రెసిడెన్సీ పర్మిట్ ఐడీ కార్డు మంజూరు కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పర్మిట్ మంజూరు అయిన తర్వాత పాస్ పోర్టును వారికి ఇస్తే దానిపై రెసిడెన్సీ స్టిక్కర్ వేసి ఇస్తారు. అటు వర్క్ రెసిడెన్సీ పర్మిట్ కు కూడా ఇదే తరహాలో ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







