2 మిలియన్ బహ్రెయినీ దినార్ల మనీ లాండరింగ్: అన్నదమ్ముల అరెస్ట్

- July 26, 2021 , by Maagulf
2 మిలియన్ బహ్రెయినీ దినార్ల మనీ లాండరింగ్: అన్నదమ్ముల అరెస్ట్

బహ్రెయిన్: ఇద్దరు వ్యక్తులు మనీ ల్యాండరింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా వారి భవిష్యత్తు ఈ శుక్రవారం తేలనుంది. ఇద్దరూ అన్నదమ్ములు. 2 మిలియన్ బహ్రెయిన్ దినార్ల మనీ ల్యాండరింగ్‌కి నిందితులు పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డాయి. వీరికి న్యాయ స్థానం 5 ఏళ్లు శిక్ష విధించగా, ఆ శిక్షను అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్‌పై తీర్పు శుక్రవారం రానుంది. నిందితులు బాధితులను ప్రలోభపెట్టి, పెద్ద మొత్తంలో డబ్బును వారి నుండి సేకరించారు. కొన్ని నెలల పాటు, లాభాలు వచ్చినట్టుగా చెప్పి, కొంత సొమ్మును బాధితులకు తిరిగిచ్చారు కూడా. నమ్మకం పెరగడంతో మరికొంతమంది వీరిని నమ్మి, నిందితులకు మరికొంత డబ్బు అందించారు. అలా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన నిందితులు జెండా ఎత్తేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల్ని అరెస్టు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com