ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో బీటెక్ ప్రోగ్రామ్స్
- July 26, 2021
హైదరాబాద్/న్యూ ఢిల్లీ: నూతన సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలోని GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMRIT) అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలలో రెండు కొత్త బిటెక్ ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
AICTE చే గుర్తింపు పొందిన ఈ సంస్థ నుంచి విద్యార్థులు ఇప్పుడు 2021-2022 అకాడెమిక్ విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్‌లో B.Tech-CSE మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్‌లో B.Tech-CSE ను అభ్యసించవచ్చు. ప్రతీ కోర్సులో 60 మంది చొప్పున విద్యార్థులు ఉంటారు. ప్రవేశం AP EAPCET ద్వారా ఉంటుంది.
_1627295906.jpg)
మెషిన్ లెర్నింగ్ అనేది కృత్రిమ మేధస్సులో ఒక ప్రత్యేక భాగం. కృత్రిమ మేధస్సు మాధ్యమాలకు సహకరించడానికి, తరువాత ఉపయోగించగల డేటాను అనుసంధానించడం ద్వారా భవిష్యత్ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో డేటా సైన్స్ చాలా ముఖ్యమైనది.
ఈ పాఠ్యాంశాలను పరిశ్రమ అవసరాలను తీర్చేలా రూపొందించారు. అంతర్గత, బయటి అధ్యాపకులచే శిక్షణ ఉంటుంది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ గెస్ట్ లెక్చర్లు అభ్యాసంలో భాగంగా ఉంటాయి. రెండూ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు కాబట్టి, AI & డేటా సైన్స్, AI, మెషిన్ లెర్నింగ్‌లలో ప్రొఫెషనల్ డిగ్రీలు పొందిన యువకులకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. రెండూ దేశంలోని టాప్ జాబ్ ఓరియెంటెడ్ ఇంజనీరింగ్ కోర్సులు.
_1627295919.jpg)
పాఠ్యాంశాలు పరిశ్రమ అవసరాలకు సంబంధించినవిగా ఉండాలని, పరిశ్రమ మరియు విద్యాసంస్థల మధ్య సహకార అభ్యాసం ఉండాలని GMRIT భావిస్తుంది. క్యాంపస్ టెక్నాలజీ ఎనేబుల్డ్ అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని అందించే GMRIT విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం సేవలను అందిస్తుంది.
GMRIT ప్రిన్సిపాల్ ప్రసాద్ సిఎల్‌విఆర్‌ఎస్‌వి మాట్లాడుతూ “భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో కొత్త అనుభవాలను సృష్టించగల అపార సామర్థ్యాలున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల అవకాశాలను అంచనా వేస్తూ, AI, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి GMRIT మరో అడుగు వేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో విజ్ఞానాన్ని కోరుకునే విద్యార్థుల కోసం ఈ స్పెషలైజ్డ్ కోర్సు ఉద్దేశించబడింది. భవిష్యత్తుపై కేంద్రీకృతమైన కోర్సుల కంటెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లీనింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వంటి సరికొత్త నైపుణ్యాల యొక్క విస్తృత అంశాలను పరిశీలిస్తుంది. ”
_1627295930.jpg)
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను తయారు చేస్తున్న GMRIT నవీన శిక్షణ నైపుణ్య కార్యక్రమాలను ప్రవేశపెట్టి గత సంవత్సరం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్’ను ప్రారంభించింది.
యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (UGC) యొక్క నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) GMRIT కి వరసుగా రెండోసారి ఎ-గ్రేడ్ సర్టిఫై చేసింది.ఇక్కడ ఉన్న అన్ని యుజీ కార్యక్రమాలు టైర్ 1 (థర్డ్ సైకిల్) కింద ఆరు సంవత్సరాల పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) చేత గుర్తింపు పొందాయి.
NIRF (నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) 2020 కింద 201 నుండి 250 బ్యాండ్‌లో ర్యాంకు పొందిన GMRIT, ARIIA (అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్స్) 50 నుంచి 75 మంది బ్యాండ్‌లో ఉంది. ఇది ఏపీలోని మొదటి ఐదు కళాశాలల్లో కూడా స్థానం పొందింది. ఇండియా టుడే, CSR GHRDC; కెరీర్ 360; ఎడ్యుకేషన్ వరల్డ్ (2021) ఇండియా, డేటా క్వెస్ట్ లాంటి వివిధ విద్యా పత్రికలచే దేశంలోని ఏపీ మరియు టాప్ 50 కళాశాలల్లో ఒకటిగా నిలిచింది.
ప్రస్తుతం, GMRITలో 09 అండర్ గ్రాడ్యుయేట్, 06 పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో 3,600 మంది విద్యార్థులు ఉన్నారు. GMRIT దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మంచి ర్యాంకును సాధిస్తూనే ఉంది. ఇప్పటివరకు 9000+ విద్యార్థులు ఈ కళాశాల నుండి ఉత్తీర్ణులయ్యారు.
GMRIT ను 1997లో GMR గ్రూప్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ విభాగం GMR వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) కింద స్థాపించారు.అంతర్జాతీయంగా ప్రమాణాలున్న ఉన్నత, సాంకేతిక విద్యను గ్రామీణ యువకుల చెంతకు తీసుకురావడం GMRIT లక్ష్యం.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







