ఎన్టీఆర్ విడుదల చేసిన 'తిమ్మరుసు' ట్రైలర్
- July 26, 2021
హైదరాబాద్: టాలెంటెడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రంలో సత్యదేవ్ నిజాయితీగల కార్పొరేట్ న్యాయవాదిగా కనిపించబోతున్నాడు. ఆయన సరసన ప్రియాంక జవాల్కర్ రొమాన్స్ చేయనుంది. బ్రహ్మజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్ దర్శకత్వం వహించాడు. మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా లాంచ్ చేశారు. ట్రైలర్ చూసిన ఆయన ఆసక్తికరంగా ఉందని చెబుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో మొదటగా విడుదలవుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తాజాగా ఈ విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇందులోని క్రైమ్ కోణం దానికి తగ్గట్లుగా ఉన్న బ్యాక్ గగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ గ్రిప్పింగ్ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







