హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లో భారీ అగ్నిప్రమాదం
- July 28, 2021
హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి నాసెన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో అప్పుడప్పుడే తెల్లారుతున్న సమయంలో బాయిలర్ పేలిపోయింది. పెద్ద శబ్దం వచ్చింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అవి ఫ్యాక్టరీ అంతా వ్యాపించాయి. కార్మికులు తలో దిక్కుకూ పరుగులు పెట్టారు. అయినప్పటికీ ఇద్దరు కార్మికులు తప్పించుకోలేకపోయారు. వారు చనిపోయారు. మరికొందరికి మంటల వల్ల తీవ్రమైన గాయాలు అయ్యాయి. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. పెద్ద ఎత్తున వస్తున్న మంటల్ని చూసి స్థానికులు... ఏం జరిగింది... ఏమైంది అని టెన్షన్ పడ్డారు. కాసేపటికే... ఫైరింజన్ సిబ్బంది వచ్చి.... మంటల్ని అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే... మంటలు అదుపులోకి వచ్చినా.... బాయిలర్‌లో ఇంకా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. అందులోంచీ పొగ బాగా వస్తోంది. ఆ ఏరియాలో ఇది తీవ్ర కలకలం రేపుతోంది.
అధికారులు అసలేం జరిగిందనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. త్వరలోనే రిపోర్ట్ ఇస్తామని అంటున్నారు. ఐతే... ఆ పరిశ్రమ చాలా పాతదైపోయిందనీ... అందుకే ఇలా జరిగిందని స్థానికులు అంటున్నారు. పాత పరిశ్రమలను తొలగించకుండా... అలాగే కంటిన్యూ చేస్తున్నారనీ... అందువల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







