ఇరాన్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
- July 28, 2021భారత్‌లో వెలుగుచూసి.. సెకండ్ వేవ్ ఉధృతికి దారితీసిన డెల్టా వేరియంట్ ఇప్పుడు పలు దేశాలపై విజృంభిస్తోంది. ఈ జాబితాలో ఇరాన్ కూడా ఉంది. అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 34,900 కేసులు, 357 మరణాలు నమోదయ్యాయి. సోమవారం కూడా 31,814 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం గత వారమే ఆంక్షలు విధించింది. కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది. నిత్యాసవసరాల దుకాణాలు మాత్రమే తెరచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. అయితే ఆంక్షల విషయంలో కఠినంగా వ్యవహరించకుండా ప్రజల అబిష్టానికే వదిలిపెట్టడంతో జనాలు సమూహాంగా తిరుగాడుతుండటంతో కేసులు పెరుగుతున్నాయి. టెహ్రాన్‌లో షాపింగ్ మాల్స్, మార్కెట్లు, మెట్రో స్టేషన్లలో జన సంచారం తీవ్రంగా ఉంది. ఆసుపత్రిలు ఖాళీ ఉండటం లేదు. ఎక్కువ మంది శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వస్తుండటంతో వైద్య నిపుణుల్లో ఆందోళన నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లోనే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







