BECILలో ఉద్యోగావకాశాలు
- August 21, 2021
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL).. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో బాగంగా మొత్తం 162 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (ఆగస్టు 22) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- మొత్తం 162 ఖాళీలకు గాను సీనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ కోఆర్డినేటర్, సైంటిస్ట్, బయో మెడికల్ ఇంజనీర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(PRO) పోస్టులను భర్తీ చేయనున్నారు.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.
- అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
- అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
- అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు వివిధ పోస్టుల ఆధారంగా నెలకు రూ.15,492 నుంచి రూ.1,23,100 వరకు చెల్లిస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 22తో ముగియనుంది.
మరిన్ని వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









