ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ కన్నుమూత
- August 21, 2021
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. లక్నోలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన రెండుసార్లు యూపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014-2019 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా సేవలందించారు. కల్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. బాబ్రీ విధ్వంసం తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగించారు. తిరిగి 1998 ఫిబ్రవరి నుంచి 1999 నవంబర్ వరకు రెండో సారి ముఖ్యమంత్రిగా కల్యాణ్ సింగ్ పనిచేశారు. కాగా కల్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







