కోవిడ్ రూల్స్ అప్ డేట్..ఫేస్ మాస్క్ నిబంధనలపై క్లారిటీ
- August 22, 2021
దుబాయ్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అమలులోకి తీసుకొచ్చిన ఫేస్ మాస్క్ నిబంధనలపై యూఏఈ కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ప్రస్తుతం యూఏఈ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కొద్దిమేర అదుపులోకి వచ్చింది. ఆగస్ట్ మాసానికి సంబంధించి అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫేస్ మాస్క్ నిబంధనల్లో కొద్ది మేర సడలింపులు ఇస్తూనే, పబ్లిక్ ప్లేసులలో మాత్రం మాస్క్ రూల్స్ కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పబ్లిక్ ప్రాంతాల్లో మాస్క్ రూల్ ఎత్తివేసి వైరస్ వ్యాప్తికి దోహదపడలేమని వెల్లడించింది. ఇక పబ్లిక్ ప్రాంతాల్లో మాస్క్ నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా 3,000 దిర్హమ్ ల జరిమానా విధింపు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓపెన్ క్లోజ్డ్ ప్లేస్, షాపింగ్ మాల్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వారు తప్పనిసరిగా మెడికల్, ఫ్యాబ్రిక్ ఫేస్ మాస్క్‌లు ధరించాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో నడుస్తున్నప్పుడు కూడా మాస్క్ మస్ట్. అలాగే ప్రైవేట్ వాహనాలలో డ్రైవర్లు, ప్రయాణీకులు మాస్క్ ధరించాలి. అయితే..డ్రైవర్ ఒంటరిగా ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులు మాత్రమే వాహనంలో ఉన్నప్పుడు మాస్క్ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే కేఫ్‌లు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ కోర్డులలో తినేటప్పుడు, త్రాగేటప్పుడు మాస్క్ తీసేయవచ్చు. పల్మనరీ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు మెడికల్ రిపోర్ట్ ఉన్న వ్యక్తులకు, పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన సమయంలో, తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి మాస్క్ నిబంధనల నుంచి సడలింపులు ఇచ్చారు. అలాగే ఒంటరిగా క్రీడా సాధన చేసేవారు..క్రీడ ఆడుతున్న వ్యక్తులు, కార్యాలయంలో వ్యక్తిగతంగా పని చేస్తున్న వ్యక్తులు కూడా మాస్క్ తీసేయవచ్చని యూఏఈ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







