మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్
- August 25, 2021
బెంగుళూరు: విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ తన కుమారుడి కోరిక మేరకు తన భార్య పోనీవర్మని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తమ 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొడుకు వేదాంత్ తమ పెళ్లి చూడాలని పట్టుబట్టడంతో మరోసారి పెళ్లి చేసుకున్నామని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. "మా వివాహానికి సాక్షిగా వేదాంత్ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం" అని ప్రకాష్‌రాజ్ తన ట్విట్లో తెలియజేశారు. అయితే ఈ వివాహానికి మొదటి భార్య పిల్లలు కూడా హాజరయ్యారు.కాగా ప్రకాష్‌రాజ్ మొదటి భార్య లలితకుమారికి విడాకులు ఇచ్చి..ఆ తర్వాత కొరియోగ్రాఫర్ పోనీవర్మని 2010లో రెండో వివాహం చేసుకున్నారు. అటు ప్రస్తుతం కె.జి.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రకాష్‌రాజ్.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







