ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్
- August 25, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కీలక ఉత్తర్వులకు జారీ చేశారు. కరోనా కారణంగా గతేడాది మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరుకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ నెల 13వ తేదీన అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ ఆదిత్యనాధ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బయోమెట్రిక్ హాజరును పునరుద్దరించాలనే అంశంపై కీలకంగా చర్చించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు హజరుపైనా చర్చ జరిగింది. చాలా మంది కార్యాలయాలకు టైంకు రాకపోవడం.. వచ్చినా బయటకు వెళ్లడం.. సమయం పూర్తి కాకపోయినా ముందుగానే ఆఫీసుల నుండి వెళ్లిపోవడం వంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బయోమెట్రిక్ హజరును పునరుద్దించాలని సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆదేశించారు.ఈ క్రమంలోనే సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖకు తెలిపారు.
ఇకపై హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు, సచివాలయాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని మెమోలో పేర్కోన్నారు. బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారీగా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని.. ప్రతీశాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని సూచించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, జిల్లా కలెక్టర్‌లకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలను జారీ చేశారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







